Anni Manchi Sakunamule | టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న చిత్రం అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సంతోష్ శోభన్ టీం. ఈ సినిమా ప్రమోషన్లో నిహారికా కొణిదెల (Niharika Konidela) కూడా భాగం అయింది. అన్నీ మంచి శకునములే చిత్రం నుంచి మెరిసే మెరిసే సాంగ్‌కు సంతోష్ శోభన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది నిహారిక.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే సంతోష్ శోభన్, మాళవికా నాయర్ చిట్ చాట్ సెషన్స్‌లో పొల్గొంటూ.. ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న అన్నీ మంచి శకునములే చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, అర్జుణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శోభన్ ఖాతాలో ప్రేమ్ కుమార్ సినిమా కూడా ఉంది. 2019లో చివరిసారిగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది నిహారిక. గతేడాది జీ5 సిరీస్ హలో వరల్డ్‌లో మెరిసిన ఈ మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది.
గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్..
సీతాకళ్యాణ వైభోగమే లిరికల్ వీడియో సాంగ్..
అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్..
Megastar vs Superstar | మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్
Ugram | మూవీ లవర్స్‌కు అందుబాటులో అల్లరి నరేశ్ ఉగ్రం టికెట్ ధరలు
Malvika Nair | నాకు అన్ని రకాల కళలు ఇష్టం : మాళవికా నాయర్