Beauty Teaser | చాలా మందికి చైల్డ్ యాక్టర్‌గా పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం నటుడు అంకిత్ కొయ్య. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలతో అలరించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రం బ్యూటీ (Beauty). నీలఖి హీరోయిన్గా నటిస్తోంది. జేఎస్ఎస్ వర్ధన్ మాటలందరిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
టీజర్లో ‘కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను..’అంటూ నరేశ్ చెబుతున్న ఎమోషనల్ డైలాగ్ ప్రతీ తండ్రీకూతుళ్లకు కనెక్ట్ అవ్వడం గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చేస్తుంది టీజర్. విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. మధ్యతరగతి కుటుంబం, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, తండ్రీకూతుళ్ల ఎమోషన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చెప్పేస్తుంది.
బ్యూటీ టీజర్..
ఒక తండ్రి పడే ఆరాటం,
ఒక తల్లి పడే ఆవేదన.Arjun & Alekhya’s story is here ❤️🔥#BeautyTeaser OUT NOW
— https://t.co/kZuJqaOI7RWitness the search, the secrets and the truth IN CINEMAS FROM 𝗦𝗘𝗣 𝟭𝟵𝘁𝗵 📽#Beauty #BeautyTheFilm#BeautyTeluguFilm pic.twitter.com/QBs82fMoJM
— Zee Studios South (@zeestudiossouth) August 23, 2025