Anjali | షాపింగ్ మాల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది రాజోలు సుందరి అంజలి (Anjali). తెలుగులో టాప్ స్టార్లతో కలిసి నటించి ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ఏడాది రాంచరణ్‌తో గేమ్ చేంజర్ సినిమాలో మెరిసింది. మరోవైపు విశాల్‌తో కలిసి నటించిన మద గజ రాజా పన్నెండేళ్ల తర్వాత విడుదలైంది. తాజాగా అంజలి కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
ఈ భామ విశాల్‌తో మరోసారి కలిసి నటిస్తోంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా అందరితో షేర్ చేసింది. నా ప్రియమైన స్నేహితుడు విశాల్ 35లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందని ట్వీట్ చేసింది అంజలి. లీడింగ్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ కాంపౌండ్ నుంచి వస్తోన్న 99వ ప్రాజెక్టులో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. విశాల్ 35వ సినిమాగా వస్తోన్న చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తోంది. తంబి రామయ్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ జులై గ్రాండ్‌గా లాంచ్ కాగా.. ఆగస్టు 1 నుంచి తొలి షెడ్యూల్ షురూ అయింది.
ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం ఊటీలో కొనసాగుతుంది. ఇక విశాల్ తాజా ప్రాజెక్ట్‌ను నాన్‌స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్‌తో 45 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. ఈ చిత్రానికి పాపులర్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్, అంజలి కాంబోలో రిపీట్ అవుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుందో చూడాలి.
Excited to team up with my dear friend @VishalKOfficial once again after #MadhaGajaRaja ! 🫶🏻 Thrilled to be part of #Vishal35. Can’t wait to work with this wonderful team. @dir_raviarasu @SuperGoodFilms_ @officialdushara @gvprakash @Richardmnathan pic.twitter.com/OLkkldKY1L
— Anjali (@yoursanjali) August 22, 2025
Chiranjeevi | తమ్ముడు నీ ప్రతీ మాట.. నా హృదయాన్ని తాకింది .. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్