RJ Mahvash | ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయోన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల అనంతరం టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో చాహల్ డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌ను వీరిద్దరు కలిసి చూడడం.. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకురింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహల్ మహ్వశ్తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ మరో కొత్త పోస్ట్ పెట్టింది మహ్వశ్.
ఇటీవల క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఒక మ్యాచ్‌కి ముందు మ్యాచ్ డే జై మాతాజీ(Match Day Jai Mata di) అంటూ పోస్ట్ పెట్టగా.. RJ మహ్వాష్ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాహల్ పెట్టిన క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టింది. RJ మహ్వాష్, తాను సహ-యజమానిగా ఉన్న ఛాంపియన్స్ లీగ్ T10 టీమ్ ‘సుప్రీమ్ స్ట్రైకర్స్’ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ డే జై మాతాజీ(Match Day Jai Mata di) పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 20న వీరికి విడాకులు మంజూరయ్యాయి.