శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 11:41:06

బాయ్‌ఫ్రెండ్‌తో చిందులేసిన అంకిత‌.. వీడియో వైర‌ల్

బాయ్‌ఫ్రెండ్‌తో చిందులేసిన అంకిత‌.. వీడియో వైర‌ల్

బాలీవుడ్ యువ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయ‌సి అంకితా లోఖండే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యాక్టివిటీస్‌కు సంబంధించిన విష‌యాల‌ని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ వ‌స్తున్న అంకిత తాజాగా త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి స్టెప్పులేసిన వీడియోని షేర్ చేసింది. 

2014లో హృతిక్ రోష‌న్, క‌త్రినా కైఫ్ న‌టించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలోని పాట‌కు వికీ, అంకితాలు వైట్ డ్రెస్ ధ‌రించి డ్యాన్స్ చేశారు. వీరిద్ద‌రి డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇటీవల దీపావ‌ళి పండుగ‌ని వీరిద్ద‌రు క‌లిసి చేసుకోగా, ఆ పండుగ‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా షేర్ చేసింది అంకితా. ఇదిలా ఉంటే అంకిత లోఖండే.. కుశాల్ టాండ‌న్ అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా క‌థ‌నాలు వ‌స్తుండ‌గా, వాటిని కొట్టి పారేశారు.logo