Animal Movie | రాయల్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్.. యానిమల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్..!
Animal Movie | ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి
Animal Movie | ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్‌ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు ఇప్పటికీ రణ్‌బీర్ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ప్రీ టీజరే ఈ లెవల్లో ఉంటే టీజర్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని అప్పుడే విజువలైజేషన్ చేసుకుంటున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. గుబురు గడ్డం, జుట్టుతో సూట్ ధరించి సిగరెట్ కాల్చుతున్నట్లున్న రాయల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 28న ఉదయం 10గంటలకు టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్‌బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు. ఇటీవలే రణ్‌బీర్ కపూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ్‌బీర్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.
రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. వీఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎలాగో రిలీజ్‌కింకా టైమ్ ఉంది కనుక ఎడిటింగ్ రూమ్‌లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
RANBIR KAPOOR: ‘ANIMAL’ TEASER DROPS ON 28 SEPT… Team #Animal will unveil #AnimalTeaser on 28 Sept 2023 [#RanbirKapoor’s birthday]… Directed by #SandeepReddyVanga, the film arrives in *cinemas* on 1 Dec 2023.
Will release in #Hindi, #Telugu, #Tamil, #Kannada and #Malayalam.… pic.twitter.com/DWoHzV5AIV
— taran adarsh (@taran_adarsh) September 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

