Venky Anil 3 | భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేశ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. Venky Anil 3గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ షురూ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ కూడా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ద్వారా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది అనిల్ రావిపూడి టీం.
ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేశ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సారి టాలీవుడ్‌తోపాటు ఇతర భాషల నటులను భాగస్వామ్యం సినిమాపై మరింత హైప్ పెంచేస్తు్న్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి.
ఈ రెండు సినిమాలు తెరకెక్కించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరోసారి హ్యాట్రిక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Animal
దర్బార్ హాల్ ఈ భారీ సెట్ వేయగా.. కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.
#VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS ❤️🔥
The team is filming key sequences with some of the main cast💥
SANKRANTHI 2025 RELEASE 🤟🏻
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna #SameerReddy #Tammiraju @prakash3933… pic.twitter.com/UeQQXF3lOr
— Vamsi Kaka (@vamsikaka) July 11, 2024
Shankar | కమల్ హాసన్ ఇండియన్ 2 ఎండింగ్లో సర్ప్రైజ్.. శంకర్ ఏం ప్లాన్ చేశాడో మరి.. ?
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Trisha | అజిత్‌కుమార్, త్రిష టీంతో వెంకట్ ప్రభు.. స్పెషలేంటో మరి..!