Anil Sunkara | టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్‌ల్లో ఒకటి ఏకే ఎంటర్టైన్మెంట్స్. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు నిర్మాత అనిల్ సుంకర. ఈ ప్రొడ్యూసర్ తాజాగా యూనిక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ సినిమా మొత్తం కొత్తవారితో రాబోతుండటం విశేషం. నటులు, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమాటోగ్రఫర్స్, ఎడిటర్స్, కాస్యూమ్ డిజైనర్స్, స్టంట్ టీమ్స్, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు, సౌండ్ డిజైనర్లు, పబ్లిసిటీ.. ఇలా క్రాఫ్టుల్లోనూ కొత్త వారినే తీసుకోబోతున్నారు. అంటే సినిమా ప్రతీ క్రాఫ్టులోనూ కొత్తవారే ఉండబోతున్నారన్నమాట.
ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. టాలెంట్ కలిగి అవకాశాలు అందని వారికి ఇస్తున్నఛాన్స్.. అని అనౌన్స్మెంట్ సందర్భంగా అనిల్ సుంకర అన్నారు. సాధారణంగా సినిమా అంటే కొన్ని క్రాఫ్టుల్లో మాత్రమే కొత్తవారు కనిపిస్తుంటారు. ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం ఉన్న వారి నుంచి నేర్చుకుంటారు. అయితే ఈ సారి మాత్రం అందరినీ కొత్తవాళ్లను పెట్టి తీయడమంటే.. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదివరకెన్నడూ ఎవరూ వేయని అరుదైన ముందడుగు అని చెప్పక తప్పదు.
ఇంకేంటి మరి మీలో ఎవరికైనా సినిమాకు సంబంధించిన ఏ క్రాఫ్టులో పని చేయాలన్న ఆసక్తి ఉందా..? అయితే వెంటనే contact@ak.movieలో అప్లై చేయండి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఏటీవీ ఒరిజినల్స్‌తో కలిసి ఈ సినిమా తెరకెక్కించనుంది.
First of Its Kind in the Cinematic World!🌎🎬
Dynamic Producer @AnilSunkara1 Announces A movie with all 24 crafts Newcomers! selections through @ATVOriginals Movie Making Reality Show – #ShowTime – Cinema Teeddam Randi!🎥
📩 Apply Now: contact@ak.movie@AKentsOfficial pic.twitter.com/Wvi7yWap6k
— AK Entertainments (@AKentsOfficial) August 16, 2025
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!