Anchor Suma | యాంకర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్‌తో అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమెకి హీరోయిన్స్‌ని మించి క్రేజ్ ఏర్పడింది. బుల్లితెర పై తిరుగులేని యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల తనదైన యాంకరింగ్ తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తుంది. మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎలాంటి ఈవెంట్ అయిన సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేసే సత్తా సుమ సొంతం. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు. వేయిపడగలు అనే సీరియల్ తో పరిచయం అయిన సుమ అందులో లీడ్ రోల్ చేసింది. ఆతర్వాత మేఘమాల సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం యాంకర్ సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, తన యూట్యూబ్ ఛానల్ తో బిజీగా గడిపేస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్లో చాట్ షో అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేస్తుండగా, ఇందులో తన వాయిస్ సమస్య గురించి చెప్పుకొచ్చింది. గతంలో నాకు వోకల్ నాడ్యూల్స్ వచ్చినపుడు డాక్టర్స్ నా వాయిస్ కి రెస్ట్ ఇవ్వమని చెప్పారు. చేసేదేం లేక పది రోజులు నేను మౌన వ్రతం చేశాను. నా వోకల్ కార్డ్స్ లో స్మాల్ బంప్స్ లాంటివి రావడంతో డాక్టర్ అస్సలు మాట్లాడొద్దు అన్నారు. దాంతో పది రోజులు మాట్లాడకుండా ఉన్నానని చెప్పుకొచ్చింది. వోకల్ నాడ్యూల్స్ అంటే మన గొంతులో మాట్లాడడానికి ఉండే నరాలకి వచ్చే సమస్య. ఇది ఎక్కువగా మాట్లాడడం, అరవడం వలన వస్తుంది.
సుమ పనే మాట్లాడడం, అరవడం కాబట్టి ఆమెకి ఆ సమస్య వచ్చింది. సమయానికి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఆ సమస్య నుండి బయటపడింది సుమ. ఇక తాను థియేటర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పుకొచ్చింది సుమ. పలు నాటకాలు వేసిన సుమ కొడుకు పుట్టాలి అనే తెలుగు నాటకం హిందీలో చేశాను. ఆల్ ఇండియా రైల్వేస్ లో భాగంగా ఖరగ్ పూర్, ఢిల్లీ.. అలా చాలా ప్లేసెస్ లో తిరిగి నాటకాలు వేశాను. అప్పట్లోనే రైల్వేస్ లో నాటకాలలో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాను. సంఘం మారాలి, రేపటి మహిళ, స్వామి వివేకానంద.. ఇలా చాలా నాటకాలు వేశాను అని తెలిపింది. కాగా, సుమ వాళ్ల నాన్న రైల్వే ఎంప్లాయి కాగా, ఉద్యోగం కోసం కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. సుమ థియేటర్ ఆర్టిస్ట్ గా రైల్వేస్ లో నాటకాలు కూడా వేసింది.