Anchor suma disease | రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ కనకాలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరేళ్ల నుంచి 60 ఏళ్లు వరకూ ఈమె యాంకరింగ్ చూసి టాలీవుడ్ ( Tollywood )లో అందరూ ఫిదా అయిపోతారు. గత పదిహేనేళ్లుగా బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా వెలిగిపోతుంది సుమ. అయితే ఈమె జీవితం తెరిచిన పుస్తకంలా అన్ని నిజాలు తెలుసని అంతా అనుకుంటారు.. కానీ ఎన్నో తెలియని నిజాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని విషయాల గురించి తాజాగా అభిమానులతో పంచుకుంది యాంకర్ సుమ. మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా తాను బాధపడుతున్న ఒక వ్యాధి గురించి అభిమానులకు చెప్పుకొని షాక్ ఇచ్చింది ఈమె. ఈ విషయం విన్న తర్వాత అమ్మో ఇన్ని సంవత్సరాలుగా సుమ ఈ వ్యాధితో బాధ పడుతున్నారా అని.. అందరూ ఒక్కసారిగా తెలియని షాక్ లోకి వెళ్లిపోయారు.
తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నట్లు సుమ చెప్పింది. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్నేండ్లుగా ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పింది. దీనివల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాని పేర్కొంది. ఈ చర్మ సమస్య కారణంగా ఏదైనా గాయమైతే అది త్వరగా తగ్గిపోదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ గాయం మరింత పెద్దదిగా అవుతుందని తెలిపింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ట్రై చేశానని.. కానీ ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యాధి తన శరీరంలో భాగమైపోయిందని చెప్పింది సుమ. కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి? ఎలా తీసేయాలి వంటి తెలియక ఈ డ్యామేజ్ జరిగిపోయిందని.. ఇప్పుడు ఉన్న దాన్ని కాపాడుకోవడం తప్ప తన చేతిలో ఏమీ లేదని బాధపడింది. సాధారణంగా మన శరీరంలో ఏదైనా మనకు నచ్చకపోతే.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచి పెడుతూ వస్తాం.. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది. అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలమని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
Rajeev kanakala | రాజీవ్ కానకాల అక్కడికి కానీ వెళ్తే రాళ్లు, చెప్పులతో కొడతారంట..
Tollywood సుమ ఇంట్లో ఉన్నా భలే గిరాకీ ఉందే..!
79 ఏళ్ల వయస్సులో వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరచిన సుమ తల్లి
Anchor Suma : అయ్య బాబోయ్.. యాంకర్ సుమ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు