Anchor ravi | బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఏం చేసినా కెమెరా కంటికి దొరక్కుండా ఉండలేరు. ఏం మాట్లాడిన కచ్చితంగా రికార్డు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే సాక్ష్యంతో సహా దొరికిపోతారు. యాంకర్ రవి ఇప్పటికే రెండు సార్లు మాట మార్చి దొరికిపోయాడు. దీంతో వీకెండ్లో నాగార్జునతో కూడా చివాట్లు తిన్నాడు. అయినా కూడా మళ్లీ యాంకర్ రవి నోరు జారుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఒక టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఇంటి బయటే లాక్ చేశాడు. ఒక టాస్క్ ఇచ్చి అందులో గెలిచిన వాళ్లకు మాత్రమే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని చెప్పాడు. ఈ టాస్క్‌లో ఓడిపోయిన యాంకర్ రవి బయటే ఉండిపోయాడు. ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్, సిరి దగ్గరికి వచ్చి తనకు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలని లేదని.. ఇవన్నీ నాకు అవసరమా.. బయటకు పంపించండి.. నాకు అవసరం లేదు.. తిండి కోసం, నిద్ర కోసం ఇన్ని కష్టాలు పడాలా.. మా అమ్మా నాన్నకు నేనొక్కడినే కొడుకును.. నాకు ఆరేళ్ల పాప కూడా ఉంది.. వాళ్లను చూసుకోవాలి.. ఇక్కడ ఉండటం నాకు అవసరం లేదు అంటూ మాట్లాడేశాడు. ఇక్కడే నెటిజన్లు యాంకర్ రవితో ఆడుకుంటున్నారు. బిగ్ బాస్‌లో ఉన్న కండిషన్స్ అన్నీ చదివిన తర్వాతే కదా ఇంట్లోకి వచ్చావు.. వచ్చిన తర్వాత మళ్లీ ఇలా నోరు జారడం ఎందుకు.. ఒకవేళ ఇష్టం లేకపోతే ముందుగానే నేను రాను అని చెప్పొచ్చు కదా.. తీరా ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ గేమ్ ఆడుతూ ఇప్పుడు మళ్లీ ఈ స్ట్రాటజీ ఎందుకు ప్లే చేస్తున్నావు.. ఉంటే ఒక మాట మీద ఉండు.. మాటిమాటికి మాట జారకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కచ్చితంగా రవి మాట్లాడిన ఈ మాటలపై వీకెండ్లో నాగార్జున స్పందించడం ఖాయం. మరి అక్కడ వీటి గురించి యాంకర్ రవి ఏం చెబుతాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anchor Ravi : నేను వెళ్లిపోతా బయటకు పంపండన్న రవి
కోపంతో చిందులు తొక్కిన ఆనీ మాస్టర్.. ఒక్కడు కూడా సొంతంగా ఆడట్లేదంటూ..
Bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగులో కొత్త కెప్టెన్ ఎవరు.. రేషన్ మేనేజర్ ఎవరు..?
siri hanumanth : సిరి-షణ్ముఖ్ వ్యవహారం శృతిమించుతున్నట్టుగా ఉందే..!
Bigg Boss 5 telugu : ఆరుబయట పడుకున్న హౌజ్‌మేట్స్.. !
Shanmukh jaswanth: అమ్మ నువ్వు క్యాన్సర్ జయించావు.. నేను ఈ బాధ నుండి బయటపడతా: షణ్ముఖ్