Anchor ravi in Bigg boss 5 telugu | బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్లో ఒక తెలివైన ఆటగాడు ఉంటాడు. గత సీజన్లోకి అభి ఆ కోవలోకి వచ్చేవాడే. ఎక్కువగా ఫిజికల్ టాస్క్ జోలికి పోకుండా మైండ్ వాడుతూ తన ఆట కోసం మిగిలిన వాళ్లను వాడుకునేవాడు అభి. అలా చివరికి ఆయన సీజన్ విన్నర్ అయ్యాడు. కానీ ఆ వాడుకునే ప్రాసెస్‌లో ప్రతి వారం నామినేట్ అయ్యేవాడు. ఈ సీజన్లో యాంకర్ రవి విషయంలో ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు 10 వారాల నామినేషన్ జరిగితే అందులో 9 వారాలు నామినేట్ అయ్యాడు రవి. తాజాగా 11వ వారం నామినేషన్స్‌లో కూడా ఉన్నాడు. ఈ వారం నామినేట్ అవ్వకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు యాంకర్ రవి ( anchor ravi ).
11వ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా జరిగింది. ముందుగా కెప్టెన్ ఆనీ మాస్టర్ నలుగురు సభ్యులను సెలెక్ట్ చేసుకొని నేరుగా నామినేట్ చేసింది. ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది. ఈ ఆటలో నామినేట్ కాకుండా చివరి వరకు రవి బాగానే ఆడాడు. కానీ చివరి నిమిషంలో కాజల్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం అతడి కొంప ముంచింది. జైలులో నామినేట్ అయిన ఇంటి సభ్యులు సేవ్ చేయాలి అంటే.. బయట ఉన్న ఇంటి సభ్యులు ఆ తాళంచెవి తీసుకొని వాళ్లకు నచ్చిన ఒక కంటెస్టెంట్‌ను బయటికి తీసుకురావాలి. అలా కాజల్ కీ తీసుకొని జైల్లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ని బయటకు తీసుకు వచ్చింది. అప్పుడు అతను రవి, శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు. అందులో ఎవరిని సేవ్ చేయాలి అనేది తాళంచెవి తీసుకొచ్చిన కాజల్ చేతిలో ఉంటుంది.
అప్పుడు మరో ఆప్షన్ లేకుండా రవిని నామినేట్ చేసింది కాజల్. అయితే దీనికి ముందు జైల్లో ఉన్న కాజల్.. బయటకు రావడానికి కారణం యాంకర్ రవి. అతడు శ్రీ రామ్ కలిసి చేసుకున్న డీల్‌లో భాగంగా జైల్లో ఉన్న కాజల్ బయటికి వచ్చింది. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు సేఫ్ జోన్లో ఉన్న యాంకర్ రవిని ఊహించని విధంగా నామినేట్ చేసింది. ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్న రవి ఈ వారం ఖచ్చితంగా సేఫ్ అవ్వాలని చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇంతా చేసిన తర్వాత చివరికి కాజల్ కూడా కెప్టెన్‌కు ఉన్న సూపర్ పవర్ కారణంగా నేరుగా నామినేట్ అయింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్‌లో మానస్, సన్నీ, కాజల్, సిరి, యాంకర్ రవి ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss 5 Telugu Elimination | 10వ వారం నామినేషన్స్‌లో ఆ ఐదుగురు..డేంజర్ జోన్లో ఉన్నది వాళ్లే !
Priyanka: షణ్ముఖ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక.. అది నా ఇష్టం అంటూ షణ్ను కామెంట్
Nominations: నామినేషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన బిగ్ బాస్.. !
Bigg Boss Telugu 5 Jessie | జెస్సీ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేశాడా..?