Ananya Panday | ‘లైగర్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అనన్యపాండే. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ దక్కింది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ సొగసరి ఓ స్పెషల్‌సాంగ్ చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అక్కినేని అఖిల్ హీరోగా గ్రామీణ రాయలసీమ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. మురళీకిషోర్ దర్శకుడు.
బలమైన సామాజిక అంశాన్ని చర్చిస్తూ తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ప్రత్యేకగీతంలో అనన్యపాండే నర్తించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారని తెలిసింది. మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Also :