‘బేబీ’ ఫేం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి మరో సినిమా చేయనున్నారు. ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయిరాజేశ్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు అందించడంతోపాటు ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకుడు.
త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు చెందిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని వారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా బాల్‌రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణం: అమృతా ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్.