Kaantha| లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇక మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంత. పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంత మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వస్తోంది.
ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మాడివే సాంగ్‌ను విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను ప్రదీప్ కుమార్ పాడాడు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చే ఈ మెలోడీ ట్రాక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతుందని విజువల్స్ చెబుతున్నాయి.
సిల్వర్ స్క్రీన్‌పై దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీని డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కలర్ఫుల్గా ఆవిష్కరించిన తీరు మూవీ లవర్స్‌ను కట్టిపడేయం పక్కా అని సాంగ్ విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. భారతీయ సినిమాలో 1960ల నాటి గత యుగానికి నివాళిగా కాంత రాబోతున్న సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
అమ్మాడివే సాంగ్..
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ