అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘జిన్’ శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి కెమెరా స్విఛాన్ చేశారు.
వచ్చేవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశమని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవిభట్, సంగీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్ హోన్నాళి, సంగీతం: అలెక్స్, కథ, స్క్రీన్‌ప్లే: పర్వీజ్ సింభ, దర్శకత్వం: చిన్మయ్ రామ్.