Amitabh Bachchan | ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. కంపెనీకి చెందిన పాన్ మసాలా కంపెనీకి చెందిన యాడ్‌లో నటించగా.. దేశవ్యాప్తంగా అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన గత అక్టోబర్‌లో పాన్ మసాలా కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు ఈ యాడ్ కోసం తీసుకున్న పారితోషికాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్లు అమితాబ్ ప్రకటించారు. ఈ బ్రాండ్ ప్రమోషన్ సరోగేట్ అడ్వర్టయిజింగ్ కిందకు వస్తుందనే విషయం తనకు తెలియదని, ఇకపై పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లతో తనకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
పాన్ మసాలా యాడ్ల నుంచి తప్పుకోవాలని నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సైతం అమితాబ్‌కు లేఖ రాసింది. ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు.. ఇలాంటి యాడ్స్ చేయకూడదని, పాన్ మసాలాతో క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని టొబాకో ఆర్గనైజేషన్ పేర్కొంది. తాజాగా పాన్ మసాలా ప్రకటనలను ప్రసారాన్ని నిలిపివేయాలని నటుడు కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. ఎండార్స్‌మెంట్‌ను రద్దు చేసినప్పటికీ.. కంపెనీ దాన్ని విస్మరిస్తోందని, సదరు పాన్ మలాసా యాడ్ ఇంకా ప్రసారమవుతోందని నోటీస్‌లో ఆరోపించారు.