Amitabh Bachchan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిజినెస్‌లో కూడా తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా తన అపార్ట్‌మెంట్‌ను భారీ మొత్తానికి అమ్మి మంచి లాభాలు గడించి వార్తల్లో నిలిచాడు బిగ్ బీ. బిగ్ బీ గత జనవరిలో ముంబైలోని ఓషివారా ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌ను విక్రయించగా.. తన పెట్టుబడిలో భారీగా అప్రిషియేషన్ పొందారు. అమితాబ్ బచ్చన్ 2021లో ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.31 కోట్లకు కొనుగోలు చేసి.. ఇప్పుడు దాన్ని రూ.83 కోట్లకు విక్రయించాడు.
ముంబైలోని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా ఈ వివరాలను పొందుపరిచింది. ఒషివారా పశ్చిమ ముంబై సమీపంలోని లోఖండ్వాలా కాంప్లెక్స్ (Lokhandwala Complex)లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. ది అట్లాంటిస్ ఏరియాలో క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో 4,5,6 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఐజీఆర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 5,185.62 చదరపు అడుగులు కార్పెట్ ఏరియా, ఆరు కారు పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉంది.
ఈ అపార్ట్మెంట్ లావాదేవీలకు స్టాంప్ డ్యూటీ పేమెంట్ రూ.4.98 కోట్లుకాగా.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30 వేలుగా పేర్కొన్నారు. డాక్యుమెంట్స్ ప్రకారం బిగ్ బీ ఈ అపార్ట్‌మెంట్‌ను 2021 ఏప్రిల్‌లో రూ.31 కోట్లకు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.83 కోట్లకు అమ్మారు. అంటే రూ.52 కోట్లు లాభం అన్నమాట. ఇది విలువపరంగా 168 శాతం గణనీయంగా పెరిగింది. బిగ్ బీ ఈ అపార్ట్‌మెంట్‌ను నటి కృతిసనన్‌కు నవంబర్ 2021లో అద్దెకు కూడా ఇచ్చాడని తెలిసిందే. మొత్తానికి తనదైన స్ట్రాటజీతో లాభాలు గడిస్తూ బిజినెస్ ప్లాన్స్‌లో చాలా మందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు బిగ్ బీ.
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?