Raj- Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక నెట్టింట ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరిద్దరూ అతి తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌మీడియా మొత్తం కోడైకూస్తోంది. అయితే, ఈ రూమర్స్‌పై (Dating Rumours) సమంతగానీ, రాజ్ గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు.
ఈ ప్రచారం నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే (Shhyamali De) పెడుతున్న పోస్ట్‌లు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘మంచి కర్మను సృష్టించండి. ప్రజలకు సాయం చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరించండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టింది. అంతకు ముందు ‘నా గురించి మాట్లాడేవారికి.. నా తరఫున మాట్లాడేవారికి.. నేను చెప్పేది వినేవారికి.. నా గురించి వార్తలు వినేవారికి.. నా గురించి రాసే వారికి.. నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా’ అనే పోస్ట్‌ను ఆమె షేర్ చేసిన విషయం తెలిసిందే. సామ్-రాజ్ డేటింగ్ రూమర్స్ వేళ శ్యామలి దే పెట్టే పోస్టులు చర్చకు దారితీస్తున్నాయి. వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమంత ఈ మధ్య ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తోంది. పలు కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్తుండటంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్‌లో భాగంగా రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్‌గా చేయగా, అందులో ఆయనకి కాస్త క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించింది. దీంతో డేటింగ్ వార్తలు నిజమేనంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రాజ్, సమంతలకి సంబంధించి వస్తున్న వార్తలని సమంత మేనేజర్ ఖండించిన విషయం తెలిసిందే.
Also Read..
“Raj- Samantha | రాజ్-సమంతల కొత్త జర్నీ.. శతమానం భవతి అని దీవించిన సీనియర్ నటి”
“Raj Nidimoru and Samantha | డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ రియాక్షన్ ఇదే!”
“Samantha- Raj | సమంత – రాజ్ సొంత ప్రాపర్టీ కోసం వెతుకుతున్నారా.. నెట్టింట వైరల్‌గా మారిన వార్త”