Samantha- Raj | నాగ చైతన్య నుండి విడిపోయినప్పటి నుండి సమంత సింగిల్‌గానే ఉంటుంది. ఈ మధ్య తెలుగు దర్శకుడు రాజ్ నిడమోరుతో ఎక్కువగా కనిపిస్తుండడంతో వారిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందనే చర్చ మొదలైంది. ‘శుభం’ సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మూవీ టీం, దర్శకుడు రాజ్ నిడమోరుతో కలిసి ఉన్న ఫోటోలను సమంత షేర్ చేసింది. ఇక రీసెంట్గా సామ్ చేసిన పోస్ట్‌లో ఆమె దర్శకుడు రాజ్‌పై వాలినట్టుగా ఉంది. దీంతో వారిద్దరి రిలేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదే సమయంలో దర్శకుడు రాజ్ సతీమణి శ్యామాలి ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టగా.. ఇది వైరల్ అవుతోంది.
నా గురించి మాట్లాడేవారికి.. నా తరఫున మాట్లాడేవారికి.. నేను చెప్పేది వినే వారికి.. నా గురించి వార్తలు వినే వారికి.. నా గురించి రాసే వారికి.. నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అంటూ శ్యామాలి పోస్ట్ పెట్టడంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. రాజ్, సమంత రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు నెట్టింట కొత్త రూమర్ ఊపందుకుంది. సామ్, రాజ్ నిడిమోరు త్వరలో ఒక్కటి కాబోతున్నారని, ఇద్దరు కలిసి ఉండేందుకు ప్రాపర్టీని వెతుకుతున్నారని ఓ వెబ్ సైట్ సంచలన కథనం ప్రచురించింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సామ్ రాజ్, త్వరలో బిగ్‌స్టెప్ తీసుకోబోతున్నారని, ఇద్దరు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రాపర్టీని వెతికే పనిలో ఉన్నారని టాక్ గట్టిగా నడుస్తుంది. మరోవైపు రాజ్ నిడిమోరు 2022లో భార్య శ్యామాలితో విడాకులు తీసుకున్నాడని, వీరిద్దరికి ఎలాంటి సంతానం లేదని, వీరికి పాప ఉందన్న ప్రచారంలో నిజం లేదని ఆ వెబ్ సైట్ రాసుకొచ్చింది. రాజ్ తీసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత నటించగా, ఆ సమయం నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని, ఆ క్రమంలోనే పిక్ లేబిల్ పేరుతో స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెట్టారని వెల్లడించింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.