Raj- Samantha | నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సింగిల్‌గానే ఉంటుంది. రెండో పెళ్లి గురించి ఆమెకు అనేక ప్రశ్నలు ఎదురు కాగా,వాటన్నింటిని కొట్టిపారేసింది.అయితే ఈ మధ్య ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుండడం, పలు కార్యక్రమాలకి కలిసి వెళ్లడం వంటివి చేస్తుండడంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్‌లో భాగంగా రాజ్ నిడుమోరుతో కలిసి దిగిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్‌గా చేయగా, అందులో ఆయనకి కాస్త క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించింది. దీంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ జోరుగా నడుస్తుంది.
మరోవైపు సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం చిత్రం సక్సెస్ కావడంతో రీసెంట్గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో సమంత వ్యక్తిగత జీవితం గురించి సీనియర్ నటి మధుమణి వేదికపై మాట్లాడుతూ సమంత రాజ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కెరీర్ లో తాను చాలామంది హీరోలకు హీరోయిన్లకు తల్లిగా నటించాను అని చెప్పిన ఆమె దాదాపు 400 చిత్రాల్లో చేసినట్టు పేర్కొంది. అయితే సమంతతో నటించడం ఇదే తొలిసారి. రంగస్థలం చిత్రంలో సమంతకు తల్లిగా నటించే అవకాశం వచ్చిన కొద్దిలో చేజారింది. శుభం చిత్రంలో నాకు అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ మొదలు పెట్టగానే చికెన్ గున్యాకు గురి కావడంతో కొంత ఆందోళన కలిగింది. ఆ టైంలో ఈ చిత్రంలో నటించగలుగుతానా లేదా అనే సందేహం కలిగింది.
అదృష్టంకొద్దీ నాలుగు నెలల తర్వాత మళ్లీ ‘శుభం’తో ప్రయాణం మొదలైంది. సమంత అందరిని ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్ కు శుభం. రాజ్, సమంత శుభంతో ఈ జర్నీ మొదలు పెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి..శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. దాంతో సమంత, రాజ్‌ల రిలేషన్ ను మదుమణి దాదాపు కన్ఫర్మ్ చేసినట్టేనా అంటూ నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. కాగా, ఇటీవల రాజ్, సమంతలకి సంబంధించి వస్తున్న వార్తలని సమంత మేనేజర్ ఖండించిన విషయం తెలిసిందే.