Raj Nidimoru and Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha), ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ చిత్రాల దర్శకుడు రాజ్ నిడిమోర్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సమంత నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం శుభం. ఈ సినిమాకు రాజ్ నిడిమోర్ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహారించాడు. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ప్రశంసలు అందుకుంటుంది. అయితే మూవీ సక్సెస్‌లో భాగంగా.. సమంత, రాజ్ కలిసి తిరుగుతుండడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ తాజాగా రూమర్స్‌పై సమంత మేనేజర్ స్పందించారు
సమంత – రాజ్నిడిమోర్ల మధ్య వస్తున్న వార్తలు పుకార్లని ఆయన ఖండించారు. అంతేకాకుండా, రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చారంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, సమంత గతంలో రాజ్-డీకే ద్వయం దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ మరియు ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో నటించిన సంగతి తెలిసిందే.