అల్లు శిరీష్ (Allu Sirish)ను హీరోగా నిలబెట్టడానికి ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఇప్పటి వరకు శిరీష్ కోరుకున్న ఇమేజ్ మాత్రం రాలేదు. అయితే ఆయన నటించిన సినిమాల్లో ఒకటి మాత్రమే ఇప్పటి వరకు విజయం సాధించింది. అదే శ్రీరస్తు శుభమస్తు (Srirastu Subhamastu). ఈ సినిమా విడుదలై ఐదేళ్లు అవుతుంది. శిరీష్, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంటగా నటించిన ఈ సినిమాను పరశురామ్ (బుజ్జి) తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు చూసే పరశురామ్ కు గీత గోవిందం ఆఫర్ ఇచ్చాడు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 2016, ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ఫైనల్ కలెక్షన్స్ చూద్దాం..
సినిమా ఫైనల్ కలెక్షన్స్ :
నైజాం: 2.65 కోట్లు
సీడెడ్: 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.65 కోట్లు
ఈస్ట్: 0.78 కోట్లు
వెస్ట్: 0.70 కోట్లు
గుంటూరు: 0.83 కోట్లు
కృష్ణా: 0.80 కోట్లు
నెల్లూరు: 0.31 కోట్లు
ఏపీ + తెలంగాణ: 9.07 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.98 కోట్లు
వరల్డ్ వైడ్: 10.05 కోట్లు
శ్రీ రస్తు శుభమస్తు సినిమాను అప్పట్లో 8.35 కోట్లకు అమ్మారు. నిజానికి అల్లు శిరీష్ రేంజ్ కు ఇది చాలా ఎక్కువ థియేట్రికల్ బిజినెస్. అయినా కూడా ఈ చిత్రం ఫుల్ రన్లో 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బయ్యర్లకు దాదాపు కోటిన్నర లాభాలు తీసుకొచ్చింది. ఈ రోజు వరకు కూడా అల్లు శిరీష్ కెరీర్ లో సోలో హిట్ ఇదొక్కటే.
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?