Natural Star Nani | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఘన విజయం సాధించడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ కావడంతో నానితో పాటు చిత్ర యూనిట్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి సన్నిధిలో నానితో పాటు నిర్మాత, నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ సినిమా విజయవంతం కావడానికి ఆశీర్వాదం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. గట్టమ్మ ఆలయానికి నాని వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఉత్సాహం చూపించారు.
#TheParadise Team At Medaram pic.twitter.com/f8QsNVKqDJ
— Telangana Box Office (@Telangana_BO) September 29, 2026