Ram Gopal Varma | రాం గోపాల్ వర్మ (Ram Gopal Varma) డెన్ నుంచి వస్తున్న చిత్రం ‘శారీ’ (Saree).సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతున్న ఈ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహస్తున్నాడు. రవి వర్మ నిర్మిస్తుండగా.. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది.
వర్మ అంటే పబ్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా పుష్ప 2 ఫీవర్‌ను క్యాష్ చేసుకుంటూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు వర్మ. పుష్ప 2 ది రూల్‌కు వస్తున్న మెగా క్రేజ్.. అల్లు కొత్త మెగా అని చెప్పే క్లియర్ ప్రూఫ్. హే అల్లు అర్జున్ నువ్వు బాహుబలివి కాదు.. కానీ స్టార్ల మెగాబలివి.. అంటూ కండలు తిరిగిన చేతి ఎమోజీని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ . ఇప్పుడు వర్మ చేసిన ఈ ట్వీట్ అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
The MEGA craze for #Pushpa2 is clear proof that ALLU is the new MEGA ..Hey @alluarjun , u are not the BAHUBALI but the MEGABALI of STARS💪💪💪 pic.twitter.com/tcsoXs41ko
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2024
Rishab Shetty | శివాజీ మహారాజ్‌గా కాంతార హీరో.. రిషబ్ శెట్టి స్టన్నింగ్ లుక్ వైరల్
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్