Kissik | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్ కాంబోలో వస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను లాంచ్ చేశారు.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ ఊరమాస్ స్టెప్పులతో హోరెత్తిస్తున్నారు. కిస్సిక్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లీల, బన్నీ స్టైలిష్ కలర్‌ఫుల్ డ్యాన్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను Sublahshini పాడింది.
సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్ట్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన డీఎస్పీ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కిస్సిక్ ఫుల్ సాంగ్..
From today, wherever you go, it will only be..
𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 …𝐊𝐈⚡⚡𝐈𝐊 #Kissik lyrical video out now ❤️🔥Telugu – https://t.co/TkxL9th8ux
Hindi – https://t.co/kqKBFFNlSh
Tamil – https://t.co/MKG62xxg0TAn Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14… pic.twitter.com/illOuls9Pn
— Mythri Movie Makers (@MythriOfficial) November 24, 2024
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన