సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి షరతులతో కూడిన బెయిల్‌ని న్యాయస్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అల్లు అర్జున్ మూడుసార్లు చిక్కడ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చివెళ్లారు. ఆదివారం 15 నిమిషాల పాటు పోలీస్‌స్టేషన్ వద్దనే ఉన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు అల్లు అర్జున్ వస్తున్నట్లు రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో రాంగోపాల్‌పేట్ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు.
తమ రాక వల్ల ఆసుపత్రి పరిసరాల్లో పబ్లిక్ ఎక్కువగా చేరే అవకాశం ఉందని, మీడియా గ్యాదరింగ్ వల్ల ఆసుపత్రి వద్ద ఉన్న ప్రశాంత వాతావరణం పాడవుతుందని పోలీసులు తెలిపారు. మీరు రావాలనుకుంటే రహస్యంగా రావాలని, వచ్చే విషయం ముందుగా సమాచారం ఇస్తే దవాఖానా యజమాన్యం, పోలీసులతో కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంట్రీ, ఎగ్జిట్‌ను ఏర్పా టు చేసేందుకు అవకాశముంటుందని పోలీసులు సూచించారు. అలా కాకుండా ముంద స్తు సమాచారం లేకుండా, మాతో సమన్వయం లేకుండా వస్తే.. అక్కడ ఎదైనా జరిగితే.. దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందంటూ రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసును అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అక్కడున్న ఆయన సిబ్బందికి పోలీసులు అందజేశారు.