Allu Arjun | పుష్ప.. ది రైజ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. తన అత్యుత్తమ నటన ద్వారా ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ( National Award for Best Actor)ను గెలుచుకున్నాడు. రేపు అంటే అక్టోబర్ 17న ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నాడు. ఈ అవార్డు అందుకోవటం కోసం అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి (Sneha Reddy)తో కలిసి ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జాతీయ అవార్డును అందుకునే క్షణాలను ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకొని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆరు జాతీయ అవార్డులతో సత్తా చాటింది. ఉత్తమ జనరంజక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అవార్డులను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ తదితరులు ఢిల్లీ పయనమై వెళ్లారు.
90 ఏండ్లకు పైబడిన సుదీర్ఘ తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. లబ్దప్రతిష్టులైన నటులెందరో ఈ అవార్డు రేసులో నిలిచినప్పటికీ ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇప్పుడా అరుదైన ఖ్యాతిని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనబరచిన అభినయం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమాలో ఎర్రచందనం కూలీగా మొదలై సిండికేట్‌ను శాసించే నాయకుడిగా పుష్పరాజ్ ప్రయాణం..ఈ క్రమంలో ఆయన పలికించిన భావోద్వేగాలు, సంఘర్షణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ వన్‌మ్యాన్ షోగా సినిమాను రక్తి కట్టించారు అల్లు అర్జున్. మాస్ లుక్‌లో ఆయన మేకోవర్, నటనాపరంగా కనబరచిన వేరియేషన్స్ హైలైట్‌గా నిలిచాయి. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు కూడా మెప్పించాయి.
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
ఉత్తమ జనరంజక చిత్రం: ఆర్ఆర్ఆర్
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్క్ష్రిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నేపథ్యగానం: కాలభైరవ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్: కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: ఉప్పెన
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి
కతియావాడి), కృతిసనన్ (మిమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి-మరాఠీ)
ఉత్తమ సినీ విమర్శకుడు: డాక్టర్ పురుషోత్తమా చార్యులు
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ)
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉద్దామ్
Also Read..
Lakme Fashion Week | లాక్మే ఫ్యాషన్ వీక్‌లో బీటౌన్ తారల సందడి.. పిక్స్ వైరల్
Shah Rukh Khan | స్టార్ నటి కొంగుపట్టుకుని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. వీడియో
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌కు పార్టీ ఇచ్చిన అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్