Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌కు పార్టీ ఇచ్చిన అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తుంది.
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తుంది. నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. నాలుగే వేల మైళ్ల దూరంలో ఉన్న ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తుంది.
రీసెంట్గా ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ పార్టీని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంటకు మరో ఫ్యామిలీ పార్టీ ఇచ్చింది. ఈ లవ్‌బర్డ్స్ వెడ్డింగ్ దగ్గర పడుతున్న సందర్భంగా అల్లు ఫ్యామిలీ పార్టీ ఇచ్చింది. ఇక ఈ పార్టీకి చిరంజీవి, నాగబాబు, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్, అల్లు శిరీష్, అలాగే మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పార్టీకి టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ కూడా వచ్చింది.
A party at home with family & friends celebrating Varun & Lavanya’s upcoming wedding! pic.twitter.com/QiQlrCw8uH
— Allu Sirish (@AlluSirish) October 16, 2023
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

