Allu Arjun Joining Pushpa Climax Shoot | ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా తిరిగి వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌కు, దర్శకుడు సుకుమార్‌కి మధ్య గొడవలు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ట్రిప్‌కు చెక్కేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చిత్రబృందం తర్వాత క్లారీటి ఇచ్చింది. ఇదిలావుంటే తాజాగా హైదరబాద్‌కు వచ్చిన అల్లు అర్జున్ పుష్ప షూటింగ్లో పాల్గోనడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం అందింది.
రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికే పుష్ప షూటింగ్ జరుగుతుండగా.. ఇతర నటులపై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే వచ్చే నెల కొత్త షెడ్యూల్‌తో పాటు క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగబోతుండగా.. అల్లు అర్జున్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Also Read..