Mass Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Mass Shooting) కలకలం సృష్టించింది. న్యూయార్క్ (New York) రాష్ట్రంలోని ఓ పార్క్ (Park) లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. రోచెస్టర్ (Rochester) నగరంలోని మాపుల్వుడ్ పార్కులో ఆదివారం సాయంత్రం 6:20 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రోచెస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ కెప్టెన్ గ్రెగె బెల్లో తెలిపిన వివరాల ప్రకారం.. మాపుల్వుడ్ పార్క్ (Maplewood Park) వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడిన సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 20 ఏళ్ల యువకుడు మరణించగా.. ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రోచెస్టర్ పోలీసులు.. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు న్యూయార్క్ మీడియా నివేదించింది.
Also Read..
Hyderabad | అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు మృతి