Allu arjun Dropped From Icon Project | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న చిత్రం ‘ఐకాన్. పుష్ప సినిమాకు ముందు ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో రద్దయినట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌తో వేరే హీరోతో ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు.
‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కోసం ‘ఐకాన్’ కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా వదిలారు.ఔ అయితే, ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ బిజీ కావడంతో, ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్యలో వేణు శ్రీరామ్ నానితో ‘తమ్ముడు’ అనే మరో కథను సిద్ధం చేసుకున్నారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కి వచ్చిన క్రేజ్ కారణంగా ఐకాన్ చిత్రం అల్లు అర్జున్ సెట్ కాదని మేకర్స్ ఆలోచించినట్లు సమాచారం.
ఇదే విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ‘ఐకాన్’ సినిమా చేసే అవకాశం లేదు. అందుకే ఈ మూవీ కోసం వేరే హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ‘తమ్ముడు’ విడుదలైన తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ స్క్రిప్ట్‌ను ముందుకు తీసుకెళ్తారు. ఇది యూనివర్సల్ స్క్రిప్ట్. హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన ఒక యాక్షన్ ఫిలిం ఇది” అని వెల్లడించారు.
Read More