ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. లండన్లో ఆయన గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. కొన్ని దశాబ్ధాల నుంచి ఆయన లండన్లోనే నివాసం ఉంటున్నారు. టీమిండియా తరపున 33 టెస్టులు ఆడిన దిలీప్.. 114 వికెట్లు తీసుకున్నాడు. అయిదేసి వికెట్లు అతను ఆరు సార్లు తీసుకున్నాడు. 15 వన్డేల్లో అతను 22 వికెట్లు తీసుకున్నాడు. సౌరాష్ట్ర, బెంగాల్, వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్కు అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
1970 దశకంలో ఉన్న మేటి స్పిన్నర్ల దారిలో దిలీప్ దోషి ముందుకు సాగాడు. అతను 32 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేశాడు. నాటింగ్హామ్షైర్లో లెజండరీ గ్యారీఫీల్డ్ సోబర్స్తో కలిసి ఆడేవాడు. 1980 దశకంలో అతను స్వల్ప సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ దశలో ఇండియన్ క్రికెట్ నడుస్తున్న తీరును ఆయన ఇష్టపడలేదు. స్పిన్ పంచ్ పేరుతో ఆటోబయోగ్రఫీ బుక్ రాశాడతను. దాంట్లో క్రికెట్ అనుభవాల గురించి చెప్పాడు.
The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London.
May his soul rest in peace 🙏 pic.twitter.com/odvkxV2s9a
— BCCI (@BCCI) June 23, 2025