Benjamin Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ
Benjamin Netanyahu: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామన్నారు.
టెల్ అవివ్ : ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ (Benjamin Netanyahu)తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా.. అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామన్నారు. గత 12 రోజులుగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర వైమానిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసిన తర్వాత.. ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం దీనిపై ప్రటకన చేసింది. క్యాబినెట్, రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్, మొసాద్ అధినేతతో పాటు కీలక నేతల్ని ప్రధాని నెతన్యహూ చర్చించారని, ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలను అందుకున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి పొంచి ఉన్న ప్రమాదం పోయిందని ఇజ్రాయిల్ చెప్పింది.
ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలో తీసుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. ఇరాన్లో కీలక టార్గెట్లపై అటాక్ చేశామని, ఆ దేశ సైనిక నేతలకు తీవ్ర నష్టం జరిగినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. తమకు సపోర్టు ఇచ్చినందుకు, అణు భయాన్ని తొలగించినందుకు అమెరికాకు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలు నెరవేరిన సందర్భంగా.. ప్రెసిడెంట్ ట్రంప్ సహకారం మేరకు.. ద్వైపాక్షిక సీజ్‌ఫైర్‌కు అంగీకరించామని ఇజ్రాయిల్ పీఎంవో తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

