Allu Aravind | ఇండస్ట్రీలోఎవరి కుంపటి వాళ్లదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్. సైమా ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఎవరికైనా నేషనల్ అవార్డ్ వస్తే పండుగలా జరుపుకోవాలి. కానీ ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదన్నారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీ స్పందించకముందే సైమా వాళ్లు స్పందించి వారందరినీ స్టేజ్‌పైకి తీసుకొచ్చి సత్కరించాలనుకోవడం చాలా ప్రశంసనీయదగ్గ విషయమన్నారు.
విజేతలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భాన్ని మనం పండగలా జరుపుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సైమా వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
కాగా గతంలో థియేటర్ల బంద్ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో వివాదం నెలకొన్న సందర్భంలో ఆ నలుగురులో నేను లేనంటూ అల్లు అరవింద్ పేర్కొన్న విషయం తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్స్ ఉంటే అందులో 15 లోపే నా ఆధీనంలో ఉన్నాయి. నన్ను ఆ నలుగురు లో కలపకండి. తెలంగాణ లో నా దగ్గర ఒక్క థియేటర్ లేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.
తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి.
ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించింది .
ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.
అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం.#AlluAravind@GeethaArts @GA2Official pic.twitter.com/l6KSTzZeMM— YJR (@yjrambabu) August 14, 2025
Nabha Natesh | బ్లాక్ డ్రెస్‌లో కిక్కిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ.. డ్యాన్స్‌తోను ఇరగదీసిందిగా..!
Jio Hotstar Free | ‘ఆపరేషన్ తిరంగ’.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉచితంగా జియో హాట్‌స్టార్
Jigris Teaser | 2 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘జిగ్రీస్’ టీజర్