Nabha Natesh | తెలుగు ఇండస్ట్రీలో తనదైన అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్… ప్రస్తుతం మళ్లీ హీరోయిన్గా బిజీ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 2018లో సుధీర్ బాబు సరసన నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నభా, ఆ సినిమాతో ఆశించినంత గుర్తింపు పొందలేకపోయినా… ‘ఇస్మార్ట్ శంకర్’ ద్వారా తెలుగులో స్టార్డమ్ దక్కించుకుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్లో నభా గ్లామర్ షోతో పాటు నటనలోనూ మెరిసింది. ఆ తర్వాత ‘డిస్కో రాజా’, ‘అడుగో’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాల్లో నటించినా… అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఈ సమయంలోనే ఈ అమ్మడు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇప్పుడామె పూర్తిగా కోలుకొని మళ్లీ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు నిఖిల్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. కానీ ప్రస్తుతం ఆ సినిమా తప్ప నభా చేతిలో కొత్త ప్రాజెక్ట్ లేదు. ఇటీవల నభా తన యాక్సిడెంట్, ఫిట్నెస్ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. “యాక్సిడెంట్ తర్వాత వర్కౌట్స్ చేయడం నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ సమయంలోనే నా శరీరంపై మరింత అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజ్లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్సిడెంట్‌కి ముందు హీరోయిన్ని కాబట్టి ఏదోలా వర్కౌట్స్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల నా ఆలోచన పూర్తిగా మారిపోయింది” అని తెలిపింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తున్న నభా, మళ్లీ దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు తీవ్రంగా కష్టపడుతోందనే చెప్పాలి. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించి కేక పెట్టించే విధంగా కనిపించి అలరించింది. మళ్లీ ఈ వీడియోని రీ పోస్ట్ చేశాను.. ఎందుకంటే ఈ రోజు కూలీ డే అంటూ కామెంట్ పెట్టింది. వీడియోలో నభా తన లుక్‌తోనే కాకుండా డ్యాన్స్‌తోను మైమరిపించింది అని చెప్పాలి.