Jigris Teaser | టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రీస్’. రోడ్ ట్రిప్ – ఫ్రెడ్షిప్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా.. మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నాడు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ-నిర్మాతలుగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. సందీప్ లాంటి స్టార్ దర్శకుడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడంతో మూవీ టీజర్‌పై మంచి బజ్ ఏర్పడింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్‌తో అదరగొడుతుంది. టీజర్ చూసిన ప్రేక్షకులు బాగుందని.. ఈ నగరానికి ఏమైంది, హుషార్ మ్యాడ్ వంటి సినిమాల వైబ్‌ని తీసుకువస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్ర టీజర్ అరుదైన రికార్డును అందుకుంది. ఈ టీజర్ వచ్చిన వారం రోజుల్లోనే 2.3 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డు సాధించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నలుగురు స్నేహితులు ఇన్ టూ ది వైల్డ్ (Into the Wild) అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూసి స్ఫూర్తి పొంది, ఫోన్లు, డబ్బులు, ఐడెంటిటీ కార్డులు లేకుండా గోవాకు ప్రయాణం మొదలుపెడతారు. ఆ ప్రయాణంలో వారికి ఎదురయ్యే సరదా, కష్టాల సమాహారమే ఈ చిత్రం. తెలంగాణ యాసలో చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి సరైన ప్రచారం చేస్తే, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘హుషారు’, మ్యాడ్ చిత్రాలవలే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ కొడుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఈశ్వరదిత్యా పనిచేస్తున్నారు, కమ్రాన్ సయ్యద్ సంగీతం అందిస్తున్నారు. స్వప్నిక్ రావు V సౌండ్ డిజైన్ చేయగా, శ్యామల్ సిక్దర్ మిక్సింగ్ బాధ్యతలు చూసుకున్నారు. చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్, నితీష్ మిశ్రా కలరింగ్ అందిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా కిశోర్ చక్రవర్తి, ప్రసన్న రావు తోడేటి, శ్రీరామ్ వల్లభదాస్, దుర్గ ప్రసాద్ బొడ్డుపల్లి, ఆశ్రిత్, సాయి పనిచేస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వంశీ-శేఖర్ చూసుకుంటున్నారు, అనిల్-భాను పబ్లిసిటీ డిజైన్, బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.