Allu Ayaan | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అల్లు అయాన్‌కు సంబంధించిన అల్లరిచేసే వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన చెల్లి అల్లు అర్హ కంటే అయాన్ ఎక్కువ అల్లరి చేయడం. సరదాగ ఆటపట్టించడం లాంటి వీడియోలు కనిపిస్తుంటాయి.
తాజాగా అల్లు అయాన్ తన తాత అల్లు అరవింద్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. మనవడు బ్యాటింగ్ చేస్తుండగా.. అల్లు అరవింద్ అయాన్‌కు బౌలింగ్ వేశాడు. ఇక అల్లు అరవింద్ వేసిన ప్రతి బాల్‌ను షాట్ ఆడాడు అయాన్. కాగా మనవడితో క్రికెట్ ఆడుతున్న అల్లు అరవింద్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. అల్లు అరవింద్ ప్రస్తుతం నాగ చైతన్యతో ‘తండేల్’ అనే మూవీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
#AlluAravind and #AlluAayan having fun playing cricket 🏏 pic.twitter.com/FOEJE8e4uA
— Suresh PRO (@SureshPRO_) August 12, 2024
Also Read..