Bacchala Malli | ఇటీవలే బచ్చలమల్లి (Bacchala Malli) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరి నరేశ్ (Allari Naresh). రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. అల్లరి నరేశ్ వన్ మ్యాన్ షోలా సాగే ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం డిజిటల్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది.
బచ్చలమల్లి అమెజాన్ ప్రైం వీడియోలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. మరి ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి. హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరాం ఇతర కీలక పాత్రల్లో నటించారు.
బచ్చలమల్లి టీజర్..
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Sai kumar | మీ ప్రేమకు సదా రుణపడి ఉంటా.. 50 ఏండ్ల సినీ ప్రస్థానంపై సాయికుమార్