‘దర్శకుడిగా నా తొలిచిత్రం ‘కొమురం భీమ్’ నుంచి ఇప్పటివరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఏఐ స్టూడియో పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రముఖ వ్యక్తి బయోపిక్ కూడా నిర్మాణంలో ఉంది’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు అల్లాణి శ్రీధర్. ఈ నెల 24న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ ‘ఈ మధ్య బాలల చిత్రాలు చాలా అరుదై పోయాయి. పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారికి అదొక వ్యసనంగా మారిపోయింది. నా మిత్రులతో కలిసి బాలల చిత్రాలు చేయాలనుకుంటున్నా. ఇంకా ఏఐ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మా ప్రణాళికలో ఉన్నాయి. చివరి శ్వాస వరకూ పనిచేస్తుండాలన్నది నా సిద్ధాంతం’ అన్నారు.