బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా వివాహ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఆప్ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో ఆమె వివాహం నేడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనుంది. గత మూడు రోజులుగా ప్రీవెడ్డింగ్ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తాను ముందే ఊహించానని ఓ రేడియో ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది పరిణీతి చోప్రా.
‘నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగారు. 2023లో పెళ్లి చేసుకుంటానేమో అని సరదాగా బదులిచ్చాను. ఇప్పుడు అదే నిజమైంది. నా మనసుకు నచ్చే వ్యక్తి దొరికేంతవరకు ఎన్నేళ్లయినా వేచి చూద్దామనుకున్నా. రాఘవ్ రూపంలో గొప్ప వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. ఎప్పుడో నాలుగేళ్ల కిత్రం నేను చెప్పిన జోస్యం నిజమైనందుకు సంతోషంగా ఉంది’ అని పరిణీతి చోప్రా పేర్కొంది. మే నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట నేడు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు.