లొకేషన్లో స్టార్ అలియాగా, ఇంట్లో అమ్మగా రెండు బాధ్యతల్నీ సమర్ధవంతంగా నెరవేరుస్తున్నారు అలియాభట్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అభిప్రాయలను పంచుకోవడం అలియాకు అలవాటు. లేటెస్ట్గా తన కుమార్తె రాహాకు సంబంధించిన పలు విశేషాలను, తాను తీసుకోబోతున్న కొత్త నిర్ణయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు అలియా.
‘ఇప్పటివరకూ ఎక్కువ శాతం సీరియస్ కథలే చేశా. ఇక నుంచి నా కూతురు రాహా కూడా నా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. అందుకే ఆ అలాంటి కథల్నే ఎంచుకుంటా. తనకు కామెడీ అంటే ఇష్టం. అందుకే.. తను చూసి నవ్వుకునే సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నా. అలాంటి కొన్ని కామెడీ కథల్ని అంగీకరించాను. ఆ ప్రాజెక్టుల గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేను. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా.’ అన్నారు అలియాభట్.