ఒకప్పుడు బాలీవుడ్లో నటించడం సౌత్ హీరోయిన్లకు డ్రీమ్‌గా ఉండేది. అయితే.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించడం బాలీవుడ్ హీరోయిన్లకు డ్రీమ్‌గా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించి, దక్షిణాది ప్రేక్షకులకు ఆల్రెడీ చేరువైంది అందాలభామ అలియాభట్. త్వరలో మరో సౌత్ సినిమాలో నటించేందుకు ఈ బాలీవుడ్ సోయగం పచ్చజెండా ఊపినట్టు ముంబయ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రుక్మిణీ వసంత్ ఇందులో కథానాయిక. అయితే.. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఇటీవలే అలియాభట్‌ని కలిశారట. కథ, పాత్ర నచ్చడంతో అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఈ సినిమాలో విలన్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి.