ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. నిజానిజాలు ఎలావున్నా.. వినడానికి మాత్రం ఆ వార్తలు ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్గా ఈ సినిమాలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నదనే వార్త మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేసింది. ఈ సినిమాలో ఓ ఫ్లాఫ్బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, ఆ ఎపిసోడ్లో సాయిపల్లవి దర్శనమిస్తుందని చాలామంది రాసుకొచ్చారు. ఇప్పుడు మరో కొత్త వార్త మీడియా సర్కిల్స్‌లోనే కాదు, ఫిల్మ్ వర్గాల్లో కూడా బలంగా వినిపిస్తుంది. ఇందులో అలియాభట్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నదట. కథ రీత్యా ఇందులో ఓ యువరాణి పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో అలియా కనిపిస్తుందని మీడియా టాక్. ఇందులో అనుపమ్‌ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ‘ఫౌజీ’ మేకర్సే ప్రకటించారు. మరి అలియా విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.