Alia Bhatt | బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలచుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఇప్పుడు ఓ సాహసోపేతమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. యంగ్ అడల్ట్ కంటెంట్‌తో ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్న ఆమె, ఈసారి థియేటర్‌కు కాకుండా ఓటీటీని టార్గెట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌కి అలియా నిర్మాతగా కూడా వ్యవహరించనుంది. ఈ కొత్త సినిమాను అలియా తన సొంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్’ పై నిర్మించనుంది.
చాక్‌బోర్డ్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దర్శకురాలిగా శ్రీతి ముఖర్జీ పరిచయం అవుతున్నారు. శ్రీతి ఎవరో కాదు… ‘బ్రహ్మాస్త్ర’, ‘వార్ 2’ ఫేమ్ అయాన్ ముఖర్జీకి బంధువు కావడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అలియాకు తన భర్త రణబీర్ కపూర్ నటించిన క్లాసిక్ ‘వేక్ అప్ సిడ్’ ఎంతో ఇష్టమట. అదే కాన్సెప్ట్‌ను ఒక అమ్మాయి కోణంలో, మరింత బోల్డ్‌గా చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆమెకు వచ్చిందట. ఈ ఐడియాను శ్రీతి ముఖర్జీతో పంచుకోవడంతో, ఆమె దాన్ని పూర్తి కథగా అభివృద్ధి చేశారు. ఈ సినిమాను కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీయనుండగా, ఎక్కువగా కొత్త నటీనటులతోనే ఫ్రెష్ స్టైల్లో తెరకెక్కించనున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇది అలియా భట్‌కు నిర్మాతగా మూడో సినిమా కానుంది.
డార్లింగ్స్ (2022, Netflix) ద్వారా అలియా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తల్లి సోని రజ్దాన్ దర్శకత్వంలో ‘డిఫికల్ట్ డాటర్స్’ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. అయితే తాజాగా అలియా భట్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అలియా భట్ పికిల్ బాల్ గేమ్ ఆడి ఇంటికి రాగా, ఫొటోగ్రాఫర్స్ ఆమెని ఫాలో అవుతున్నారు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అలియా భట్ దయచేసి లోపలికి రాకండి. ఇదేమి మీ ఇల్లు కాదు కదా, దయచేసి బయటకు వెళ్లండి అంటూ ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, కల్కి 2898 AD సీక్వెల్లో అలియాను తీసుకోవాలన్న ఆలోచన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఉన్నట్లు టాక్ నడుస్తుంది.