e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News మాన‌వ‌త్వం చాటుకున్న క‌మెడీయ‌న్..!

మాన‌వ‌త్వం చాటుకున్న క‌మెడీయ‌న్..!

మాన‌వ‌త్వం చాటుకున్న క‌మెడీయ‌న్..!

క‌రోనా విజృంభిస్తున్న వేళ సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ఉదార‌త చాటుకుంటున్నారు. త‌మ‌కు తోచినంత సాయం చేస్తూ పేద‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. సోనూసూద్‌, నిఖిల్, చిరంజీవి వంటి వారైతే ఆప‌ద‌లో ఉన్నార‌ని తెలిస్తే వెంట‌నే స్పందించి త‌గు సాయం చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా క‌మెడీయ‌న్ అలీ కూడా త‌న వంతు సాయం చేశారు.

క‌రోనా వ‌ల‌న లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సినిమా రంగానికి చెందిన చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన అలీ తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మంది మహిళలకు త‌న భార్య జుబేదా చేతుల మీదుగా నిత్యావ‌స‌ర స‌రుకులు సాయంగా అందించారు. మా క‌న్నా ముందే లొకేష‌న్‌లో ఉండే లేడీస్ సెట్‌లో అంద‌రు తినే ప్లేట్స్, క‌ప్పులు శుభ్రం చేస్తుంటారు. లాక్‌డౌస్ వ‌ల‌న వారు ఇబ్బందుల్లో ఉన్నార‌ని తెలిసి , రూ. 2 ల‌క్ష‌ల‌తో సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని అలీ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌!
24-05-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాన‌వ‌త్వం చాటుకున్న క‌మెడీయ‌న్..!

ట్రెండింగ్‌

Advertisement