Jolly LLB 3 | బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంఛైజీల జాబితాలో టాప్‌లో ఉంటుంది జాలీ ఎల్ఎల్బీ (Jolly LLB) . కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగే ఈ ప్రాంచైజీలో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) , అర్షద్ వర్షి (ArshadWarsi) , సౌరభ్ శుక్లా కాంబోలో వచ్చిన మూడో పార్టు జాలీ ఎల్ఎల్బీ 3 (Jolly LLB 3). సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
జాలీ ఎల్ఎల్బీ 3 ఇక ఓటీటీలో తన లక్ పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ మూవీ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలిసిందే. ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రీమియర్ అప్డేట్ రానే వచ్చింది. ఎనిమిది వారాల థ్రియాట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ నవంబర్ 14 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇంకేంటి మరి ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో ఓ లుక్కేయండి. సుభాష్ కపూర్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ మూవీని స్టార్ స్టూడియోస్ 18, కంగ్ర టాకీస్ బ్యానర్లపై అలోక్ జైన్, అజిత్ అంధరే సంయుక్తంగా తెరకెక్కించారు. సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పార్టులో బొమన్ ఇరానీ, అర్షద్ వర్షి, అమృతారావు, సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించగా.. సీక్వెల్ జాలీ ఎల్ఎల్బీ 2లో అక్షయ్‌కుమార్ , అర్షద్ వర్షినటించారు.
Milord, permission to be Jolly cause tareekh mil gayi hai! 🥳👨⚖
Watch Jolly LLB 3, out 14 November, on Netflix. #JollyLLB3OnNetflix pic.twitter.com/pSJwG8PDZt— Star Studio18 (@starstudio18_) November 13, 2025
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ