సమంత (Samantha)తో వివాహం తరువాత నాగచైతన్య (Naga chaitanya) కెరీర్ విషయంలో అక్కినేని నాగార్జున (Nagarjuna)పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు..అంతేకాదు చైతూ కెరీర్‌తో పాటు వైవాహిక జీవితం కూడా సాఫీగానే సాగుతుండటంతో తండ్రిగా నాగ్ ఎంతో హ్యాపీగానే ఫీలయ్యాడు. అయితే తాజాగా చైతన్య-సమంతలు విడాకులు (Divorce) తీసుకుని విడిపోయిన తరువాత నాగచైతన్య పర్సనల్ లైఫ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. దీంతో తండ్రిగా నాగార్జున కూడా ఎంతో డిస్ట్రబ్ అయ్యాడు.
ఎట్టి పరిస్థితుల్లో చైతూను ఆ మూడ్‌లో నుంచి డైవర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు నాగార్జున. ఇందుకు చైతూను వీలున్నంత వరకు సినిమా షూటింగ్‌లతో బిజీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్‌ను వేగవంతం చేశాడు. అంతేకాదు ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర నిడివిని పెంచడమే కాకుండా సినిమాలో చైతూనే హైలైట్ చేసేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయించాడు. ఇప్పుడు చైతూ విషయంలో నాగ్ ఎక్స్ట్రా కేర్ చూపిస్తున్నాడు.
చైతూకు ఒంటరికి అనే ఫీలింగ్ రాకుండా వీలున్నప్పుడల్లా అతనితో సమయం గడుపుతున్నాడు నాగార్జున. చైతూ ఈ మూడ్ నుంచి బయటికి వచ్చే వరకు నాగ్‌కు ఈ ఎక్స్ట్రా కేర్ తప్పదు మరి..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్