టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నరేశ్‌తో నాంది చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కనకమేడల మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగ్రం టీజర్ ను రేపు ఉదయం 11:34 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ అల్లరి నరేశ్ ఓ పోస్టర్‌ను షేర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే మేకర్స్ ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించారు. అల్లరి నరేశ్ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) భాగస్వామ్యం కాబోతున్నాడు. ఉగ్రం టీజర్‌ను నాగచైతన్య లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. రేపు ఏఎంబీ సినిమాస్‌లో ఉగ్రం టీజర్ లాంఛ్ ఈవెంట్ జరుగనుంది. నేను ఇంతకుముందెన్నడూ చేయని, మీరు ఇంతముందు ఎన్నడూ చూడని.. కొత్త అంశంతో మీ ముందుకొస్తున్నా అల్లరి నరేశ్ షేర్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి కథ, సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఉగ్రం చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మే 5న థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో మలయాళ భామ మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
షైన్ స్క్రీన్స్ ట్వీట్..
#Ugram Teaser launch by Yuva Samrat @chay_akkineni Garu 💥💥
Tomorrow at AMB Cinemas from 10 AM onwards 🔥
– https://t.co/TIzbLXuMU5#NareshVijay2
@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @brahmakadali @Sid_dop pic.twitter.com/qn7ECH0msM— Shine Screens (@Shine_Screens) February 21, 2023
అల్లరి నరేశ్ ఉగ్రం టీజర్ అప్డేట్ ట్వీట్
Gear up for something I've never done before and you've never seen before 💥#Ugram Teaser on 22nd February at 11.34 AM 🔥🔥#NareshVijay2
@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @brahmakadali @Sid_dop pic.twitter.com/Lv5vZoSiyt— Allari Naresh (@allarinaresh) February 21, 2023
Ram Charan | ఇరవై రోజుల ముందే యూఎస్‌కు రాంచరణ్.. కారణమిదే..!
AK 62 | అజిత్‌తో నాలుగోసారి.. మరో హిట్టు పడ్డట్టేనా..?
Allu Aravind | అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నా : అల్లు అరవింద్
Janhvi Kapoor | నీ కోసం ప్రతీ చోటా వెతుకుతున్నా అమ్మా.. జాన్వీకపూర్ భావోద్వేగ సందేశం