అక్కినేని నాగేశ్వర రావు మనువడిగా ,అక్కినేని నాగార్జున తనయుడిగా అందరికి సుపరిచితుడే హీరో అఖిల్. తన మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ తరువాత ఈ హీరోకి సక్సెస్ తెచ్చి పెట్టిన సినిమాలు ఏవీ లేవు. మోస్ట ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. తరువాత ఆయన తదుపరి చిత్రం ఏజెంట్ తో అతి పెద్ద పరాజయం చవిచూశాడు. ఏజెంట్ సినిమా కోసం ఎంత కష్టపడినా కథలో విషయం లేకపోవడంతో నెగెటివ్ రిజల్ట్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. గతేడాది ఏజెంట్ డిజాస్టర్ తరువాత అఖిల్ ఏ సినిమా మొదలు పెట్టలేదు. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లాంటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ తరహాలోనే సినిమాలు ఎంపిక చేసుకోని ఉంటే అఖిల్ కెరీర్ ట్రాక్ లో పడేది. చాలా కాలం నుండి అఖిల్ మంచి కథ కోసం వేచి చూస్తున్నాడు.
అయితే తన తనయుడు అఖిల్ కోసం హీరో నాగార్జున రంగంలోకి దిగి ఓ కథను వెతికి పట్టినట్లుగా తెలుస్తుంది. `వినరో భాగ్యము విష్ణు కథ`రూపొందించిన దర్శకుడు మురళీ కిశోర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథ చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్ డ్రామా కథగా ఉంటుందని ,అఖిల్ కు సరిగ్గా సరిపోయేలా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు నాగార్జున తెలిపారు. తమ సొంత నిర్మాణ సంన్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్ళకు అఖిల్ కు ఓ ప్రాజెక్ట్ కుదిరిందంటా , ఈ ప్రాజెక్టైనా అఖిల్ కు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read..